2025 ఫస్టాఫ్ రిపోర్ట్!
ఈ ఏడాది అప్పుడే క్యాలెండర్ లో ఆరు నెలలు గిర్రున తిరిగాయి. టాలీవుడ్-2025 లో ఫస్ట్ హాఫ్ పూర్తయ్యింది. మరి.. ఈ ఆరు నెలల్లో వచ్చిన చిత్రాలు టాలీవుడ్ కి ఎలాంటి ఫలితాల్ని అందించాయి.;
ఈ ఏడాది అప్పుడే క్యాలెండర్ లో ఆరు నెలలు గిర్రున తిరిగాయి. టాలీవుడ్-2025 లో ఫస్ట్ హాఫ్ పూర్తయ్యింది. మరి.. ఈ ఆరు నెలల్లో వచ్చిన చిత్రాలు టాలీవుడ్ కి ఎలాంటి ఫలితాల్ని అందించాయి. ఏఏ చిత్రాలు విజయాలు సాధించాయి. ఏ సినిమాలు అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాయి వంటి విశేషాలను చూద్దాం.
జనవరిలో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రాలలో సంక్రాంతి సినిమాలనే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సంక్రాంతి కానుకగా జనవరి 12న 'గేమ్ ఛేంజర్' వస్తే.. 12న 'డాకు మహారాజ్', 14న 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' ఘన విజయాన్ని సాధించింగా.. బాలకృష్ణ 'డాకు మహారాజ్' మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఎన్నో అంచనాలతో వచ్చిన రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' డిజాస్టర్ గా మిగిలింది.
అక్కినేని నవ సామ్రాట్ నాగచైతన్యకు ఇది మెమరబుల్ ఇయర్ గా నిలిచింది. చందూ మొండేటి డైరెక్షన్ లో గీతా ఆర్ట్స్ నిర్మించిన 'తండేల్' చిత్రం ఘన విజయాన్ని సాధించింది. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజైన ఈ మూవీ రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. నాగచైతన్య, సాయి పల్లవి స్క్రీన్ ప్రెజెన్స్, దేవిశ్రీ ప్రసాద్ పాటలు 'తండేల్' విజయంలో కీలక పాత్ర పోషించాయి.
2025 ఫస్టాఫ్ లో సర్ప్రైజింగ్ హిట్ అంటే 'కోర్ట్' చిత్రాన్ని చెప్పొచ్చు. నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో రూపొందిన ఈ కోర్ట్ డ్రామా నిర్మాతలకు భారీ లాభాలను తీసుకొచ్చింది. ఈ సినిమాతో రామ్‌జగదీష్ దర్శకుడిగా మంచి గుర్తింపును పొందాడు. ఇక ఇదే ఏడాది నేచురల్ స్టార్ నానికి నిర్మాతగా, హీరోగానూ ఘన విజయం దక్కింది. ‘హిట్’ ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన నాని ‘హిట్-3’ వరల్డ్ వైడ్ గా రూ.100 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి 'డాకు మహారాజ్' తర్వాత వచ్చిన 'మ్యాడ్ స్క్వేర్' కూడా ఘన విజయాన్ని అందుకుంది. సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, విష్ణు ఓయ్ ప్రధాన పాత్రల్లో కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘మ్యాడ్ స్క్వేర్’ ఫుల్ లెన్త్ ఎంటర్‌టైనర్‌గా నవ్వులు పూయించింది.
గీతా ఆర్ట్స్ కు 'తండేల్'తో పాటు శ్రీవిష్ణు నటించిన 'సింగిల్' రూపంలోనూ విజయం వరించింది. కార్తిక్‌రాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా రూ.40 కోట్లకుపైగా కలెక్షన్స్ కొల్లగొట్టింది. సమంత నిర్మించిన ‘శుభం’ సినిమా సేఫ్ ప్రాజెక్ట్‌గా నిలిచింది. ఇక నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి మరో కీలక పాత్రలో నటించిన 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' కూడా బాక్సాఫీస్ వద్ద బాగా పెర్ఫామ్ చేసింది.
'కోర్ట్' తర్వాత ఈ ఏడాది ప్రియదర్శికి 'సారంగపాణి జాతకం'తో మరో హిట్ వరించింది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ మల్టీస్టారర్ 'భైరవం' మంచి ఓపెనింగ్స్ దక్కించింది. ఇక ఇటీవల రిలీజైన నాగార్జున, ధనుష్ మల్టీస్టారర్ ‘కుబేర’, మంచు విష్ణు ‘కన్నప్ప’ చిత్రాలు 2025 ఫస్టాఫ్ కి మంచి ఎండింగ్ ఇచ్చాయి.
మరోవైపు ఈ ఏడాది ప్రథమార్థంలో ఎన్నో అంచనాలతో వచ్చిన చరణ్ 'గేమ్ ఛేంజర్'తో పాటు నితిన్ 'రాబిన్ హుడ్', విశ్వక్ సేన్ 'లైలా', సిద్ధు జొన్నలగడ్డ 'లైలా' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి.