తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్మన్‌గా ఉపాసన

X
క్రీడా సదుపాయాల విస్తరణలో కీలక పాత్ర పోషించనున్న ఉపాసన - అంతర్జాతీయ ఈవెంట్ల నిర్వహణపై దృష్టి
తెలంగాణ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. సినీ నటుడు రామ్ చరణ్ భార్య, అపోలో హాస్పిటల్స్ వైస్-చైర్‌పర్సన్ ఉపాసన కొణిదెలను తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్మన్‌గా నియమించింది.
ఉపాసన నియామకంతో రాష్ట్ర క్రీడా రంగంలో మరింత ఉత్సాహం, అభివృద్ధి కలగనున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. క్రీడా సౌకర్యాల విస్తరణ, అంతర్జాతీయ స్థాయి క్రీడా ఈవెంట్ల నిర్వహణ, క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందించడంలో ఆమె కీలక పాత్ర పోషించనున్నారు.
తెలంగాణ స్పోర్ట్స్ హబ్, రాష్ట్రంలోని క్రీడా అభివృద్ధికి కేంద్రబిందువుగా నిలుస్తూ, ప్రపంచ స్థాయి సదుపాయాలను అందించడానికి కృషి చేస్తోంది. ఉపాసన నియామకం ఈ లక్ష్యాలను చేరుకోవడంలో తోడ్పడనుందని క్రీడా విభాగం అధికారులు పేర్కొన్నారు.
Next Story
-
Home
-
Menu