విదేశాల్లో చదివిన మెడికల్‌ విద్యార్థులకు పీఆర్‌ నెంబర్‌ నిరాకరణపై జగన్‌ ఆగ్రహం

విదేశాల్లో చదివిన మెడికల్‌ విద్యార్థులకు పీఆర్‌ నెంబర్‌ నిరాకరణపై జగన్‌ ఆగ్రహం
X
వైద్య విద్యార్థుల పోరాటానికి వైఎస్‌ జగన్‌ సంఘీభావం

విదేశాల్లో మెడికల్‌ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులు పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్ (పీఆర్‌) నంబర్లు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు ఆయనను కలసి తమ సమస్యలు వివరించారు. ఎఫ్‌ఎంజీ పరీక్ష, ఇంటర్న్‌షిప్‌ పూర్తయ్యినా పీఆర్‌ నంబర్లు ఇవ్వక విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకోవడమే అని విమర్శించారు. గత ప్రభుత్వం హయాంలో 17 మెడికల్‌ కాలేజీలు తీసుకువచ్చామని, ప్రస్తుతం ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేస్తోందన్నారు. విద్యార్థుల పోరాటానికి పూర్తి మద్దతు ఉంటుందని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.



Tags

Next Story