ప్రజల మధ్య ఉండాలి, నినాదాల్లో కాదు!" – ఎంపీ కొండా రెడ్డి ఫైర్

X
గుండెల్లో రాముడూ, చేతల్లో సేవ ఉండాలి!" – పార్టీ నేతలకు ఎంపీ హితబోధ
గుండెలో రాముడూ ఉండాలి, గుండెల్లో భారతమాతా ఉండాలి. కానీ అదేంటో – కేవలం నినాదాలతో కాక, కృషితో దేశాన్ని సేవించాలి. లేదంటే అటువంటి రాజకీయ పార్టీలకి, అటువంటి నాయకత్వానికి అర్థమే ఉండదు.
ఇది ఎవరో కార్యకర్త చెప్పిన మాట కాదు... నిజంగా తన పార్టీకి హితబోధ చేయాలన్న ధ్యేయంతో మాటలు చెప్తున్న వ్యక్తి... తన పార్టీ నేతలకే సూటిగా చెప్పేశారు ఎంపీ కొండా రెడ్డి.
తన సొంత నియోజకవర్గంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో, కొందరు పార్టీ నాయకులు మాటల్లో దేశభక్తిని మాటల్లో రాముడిని చూపిస్తూ, కానీ చేతల్లో మాత్రం సేవతత్వం లేకపోవడాన్ని ఆయన గమనించి, ఇలా ఎమోషనల్స్ అయ్యారు.
ప్రజాసేవ లేకుండా రాముడి పేరు తీసుకుంటే ఆయనకే అవమానం. కేవలం నినాదాలు చాలు అనుకునే నాయకులు పార్టీని ముందుకు తీసుకెళ్లలేరు. నమ్మకంతో పని చేయాలి, ప్రజల నడుమ ఉండాలి అని హితవు పలికారు.
Next Story
-
Home
-
Menu