గుజరాత్ లోని గంభీరా బ్రిడ్జ్ ప్రమాదం: వడోదరాలో ఆందోళన

గుజరాత్ లోని గంభీరా బ్రిడ్జ్ ప్రమాదం: వడోదరాలో ఆందోళన
X
బ్రిడ్జ్ కుప్పకూలిన ఘటనపై అధికారులు రంగంలోకి – సహాయక చర్యలు కొనసాగుతున్నాయి

గుజరాత్‌లోని వడోదరా జిల్లాలో, వడోదరా–ఆనందను కలిపే గంభీరా బ్రిడ్జ్ మహిసాగర్ నదిపై పద్రా ప్రాంతంలో కూలిపోయింది.ఈ సంఘటన నేపథ్యంలో స్థానిక పరిపాలన అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ సంఘటన లో బ్రిడ్జ్ మీదుగా వెళ్ళుతున్న వాహనాలు నదిలో పడిపోయాయి.ఈ సంఘటన లో ఎంత ప్రాణ నష్టం జరిగింది,అనే వివరాలు తెలియరాలేదు.ప్రమాద సమయంలో ఎన్ని వాహనాలు వెళుతున్నాయి అనే విషయమై ఇంకా పూర్తి సమాచారం అందలేదు. అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు.

ఇది వడోదరా–ఆనంద మధ్య ప్రధాన రవాణా మార్గంగా ఉన్నందున, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.



Tags

Next Story