తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో అగ్నిప్రమాదం- ఖాళీ బోగీలో మంటలు

తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలోని స్టెబ్లింగ్ యార్డ్‌లో సోమవారం(జులై 14) ఉదయం ఘోరంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఖాళీగా నిలిపి ఉంచిన జనరల్ కోచ్‌లో మంటలు చెలరేగాయి. ఇది 04717 హిసార్ – తిరుపతి స్పెషల్ రైలుకు చెందిన బోగీగా గుర్తించారు.
శాటింగ్ ప్రక్రియలో భాగంగా బోగీలను యార్డ్‌లోకి తరలిస్తుండగా ఒక ఖాళీ బోగీలో మంటలు మొదలయ్యాయి. అప్పటికే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది మిగతా బోగీలను వెంటనే వేరు చేసి పెద్ద ప్రమాదాన్ని నివారించారు. అగ్నిమాపక బృందం తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చింది.
ప్రారంభ సమాచారం ప్రకారం మంటలు వ్యాపించిన బోగీలు ఇషార్ ఎక్స్‌ప్రెస్ మరియు రాయలసీమ ఎక్స్‌ప్రెస్కు సంబంధించి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇది ఖాళీ కోచ్ కావడంతో ప్రయాణికులెవరూ ఉండలేదు. తద్వారా ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదు.
ఈ ఘటన తర్వాత కూడా తిరుపతి రైల్వే స్టేషన్ నుండి వచ్చే, వెళ్లే రైలు సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం తలెత్తలేదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు. ఎలక్ట్రికల్ లోపమా? లేదా మానవ తప్పిదమా అన్నదానిపై స్పష్టత త్వరలో వెలువడే అవకాశం ఉంది.
-
Home
-
Menu