కార్యకర్తలను అవమానించిన బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి!

కార్యకర్తలను అవమానించిన బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి!
X
పార్టీ నాశనం అవుతుందన్న ఎంపీ వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి

నాకు కార్యకర్తలతో అవసరం లేదు… నాకోసం ఎవరు వేచి చూసినా నాకేంటి… పార్టీ నాశనం అవుతుంది కావచ్చు అంటూ తెలంగాణ బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి.

పార్టీ శ్రేణుల కృషిని తక్కువచేసే ఈ వ్యాఖ్యలు కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించాయి. నాయకుడి నుండి ఇలాంటి దూషణలు రావడం పార్టీ నైతికతను ప్రశ్నించించే పరిస్థితి సృష్టించింది.

పార్టీ అభివృద్ధికి నడిపించాల్సిన నేతే, పార్టీ నాశనం అవుతుందని వ్యాఖ్యానించడాన్ని కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రజా ప్రతినిధిగా ఉండి కార్యకర్తల దృష్టిని, మనోభావాలను అగౌరవపరచడం దురదృష్టకరం అని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఈ వ్యాఖ్యలు పార్టీలో అంతర్గత కలహాలకు దారి తీసే అవకాశమున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.


Tags

Next Story