పూరీ - సేతుపతి సంచలన కాంబో!

పూరీ - సేతుపతి సంచలన కాంబో!
X
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కలిసి పాన్ ఇండియా స్థాయిలో ఓ మాస్టర్‌పీస్ అందించేందుకు సిద్ధమవుతున్నారు. పూరీ కనెక్ట్స్ సంస్థ ఉగాది సందర్భంగా ఈ క్రేజీ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించింది.

'లైగర్, డబుల్ ఇస్మార్ట్' డిజాస్టర్స్ తర్వాత పూరీ జగన్నాథ్ చేయబోయే ప్రాజెక్టుపై ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. చివరికి తమిళ నటుడు విజయ్ సేతుపతితో ఆయన సినిమా చేయనున్నట్లు తాజాగా వెల్లడైంది. ఈ మేరకు పూరీ, ఛార్మీ కౌర్ విజయ్ సేతుపతితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ, 'సెన్సేషనల్ కాంబినేషన్‌లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది' అని ప్రకటించారు.

ఈ పాన్ ఇండియా మూవీ జూన్‌లో ప్రారంభం కానుంది. పూరీ జగన్నాథ్ మాస్ కమర్షియల్ సినిమాలకు మాస్టర్, విజయ్ సేతుపతి విభిన్న పాత్రల్లో ఒదిగిపోయే వెర్సటైల్ యాక్టర్. ఈ కాంబినేషన్ నుంచి రాబోయే సినిమా మీద భారీ అంచనాలే నెలకొన్నాయి. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Tags

Next Story