రేపే ‘యమదొంగ‘ రీరిలీజ్

రేపే ‘యమదొంగ‘ రీరిలీజ్
X
ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల మోజు ఊపందుకుంది. పాత హిట్ సినిమాలను మళ్లీ తెరపైకి తీసుకువచ్చి, కొత్త టెక్నాలజీతో మెరుగుపరచి, ప్రేక్షకులకు నొస్టాల్జిక్ అనుభూతిని కలిగిస్తున్నారు.

ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల మోజు ఊపందుకుంది. పాత హిట్ సినిమాలను మళ్లీ తెరపైకి తీసుకువచ్చి, కొత్త టెక్నాలజీతో మెరుగుపరచి, ప్రేక్షకులకు నొస్టాల్జిక్ అనుభూతిని కలిగిస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోల పుట్టినరోజులు, పండుగలు వంటి ప్రత్యేక సందర్భాల్లో ఈ సినిమాల రీ రిలీజులు ఫ్యాన్స్‌కు పండుగలా మారుతున్నాయి.

ఈకోవలోనే మే 20న ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ గా ‘యమదొంగ‘ రీ రిలీజ్ కు రెడీ అయ్యింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఎపిక్ యాక్షన్ ఫాంటసీ 'యమదొంగ' 2007లో విడుదలై ఘన విజయం సాధించింది. ఇప్పుడు తారక్ బర్త్ డే కి రెండు రోజులు ముందుగానే అంటే రేపు (మే 18) ‘యమదొంగ‘ గ్రాండ్ గా రీ రిలీజవుతుంది.

ఈ రీ రిలీజ్ స్పెషల్ షోస్ మే 18, 19, 20 తేదీల్లో మూడు రోజులపాటు ప్రదర్శించనున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ ‘యమదొంగ‘ ప్రత్యేక షోస్ వేయబోతున్నారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తుండటం విశేషం.



Tags

Next Story