‘మాస్ జాతర’లో వింటేజ్ రవితేజ!

‘మాస్ జాతర’లో వింటేజ్ రవితేజ!
X
మాస్ మహారాజ రవితేజ హీరోగా, శ్రీలీల హీరోయిన్‌గా, భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'మాస్ జాతర'. అక్టోబర్ 31న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కు రెడీ అవుతుంది.

మాస్ మహారాజ రవితేజ హీరోగా, శ్రీలీల హీరోయిన్‌గా, భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'మాస్ జాతర'. అక్టోబర్ 31న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కు రెడీ అవుతుంది. వింటేజ్ రవితేజను చూపించే ఎలిమెంట్స్‌తో పాటు ఫుల్ ఎంటర్‌టైన్మెంట్, ఎమోషన్ ప్యాక్‌తో ఈ సినిమా ప్రేక్షకులను అలరించబోతుందని టీమ్ చెబుతుంది.

లేటెస్ట్ గా యాంకర్ సుమతో జరిగిన ఫన్ ఇంటర్వ్యూలో రవితేజ, శ్రీలీల, దర్శకుడు భాను పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇందులో రవితేజ తాను ఆర్‌పిఎఫ్ (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) అధికారి పాత్రలో కనిపిస్తానని, ఇది తన కెరీర్‌లో ప్రత్యేకమైన రోల్ అని తెలిపాడు. భాను ప్రతిభావంతుడు, ప్రతి సీన్‌ను మరింత మెరుగ్గా మలచగలడని అభినందించాడు. భీమ్స్ అందించిన మ్యూజిక్ కూడా చిత్రానికి హైలైట్ కానుందని రవితేజ చెప్పాడు.

ఇక శ్రీలీల ఈ సినిమాలో శ్రీకాకుళం యాసలో మాట్లాడే సైన్స్ టీచర్‌గా అలరించనుందట. 'స్క్రిప్ట్ చదివినప్పుడే నవ్వులు ఆగలేదు. సెట్‌లో అయితే డబుల్ ఫన్' అంటూ ఆమె చెప్పింది. అలాగే రవితేజ అంకితభావాన్ని మెచ్చుకుంటూ, గాయంతో ఉన్నప్పటికీ ‘తూ మేరా లవర్’ పాటను పూర్తి చేసిన ఆయన నిబద్ధతను ప్రశంసించింది.

దర్శకుడు భాను మాట్లాడుతూ, ‘మాస్ జాతర’ టైటిల్ ఆలోచన రవితేజ గారిదే. రాజేంద్ర ప్రసాద్ గారు వినోదభరితమైన పాత్రలో కనిపిస్తారు. హాస్యం, మాస్, ఫ్యామిలీ ఎమోషన్‌లతో అన్ని వయసుల ప్రేక్షకులను కనెక్ట్ చేసే మూవీ అవుతుంది' అన్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మించిన ఈ భారీ ప్రాజెక్ట్‌ ఇప్పటికే టీజర్, పాటలతో హైప్ ను పెంచేసింది. మొత్తంగా రవితేజ ఫ్యాన్స్‌కి ‘మాస్ జాతర’ నిజంగానే ఒక పండుగ కానుంది.



Tags

Next Story