వెంకటేష్-త్రివిక్రమ్ ప్రకటన వస్తోంది!

‘సంక్రాంతికి వస్తున్నాం‘ చిత్రంతో తన కెరీర్ లోనే అతి పెద్ద విజయాన్ని అందుకున్నాడు వెంకటేష్. అంతేకాదు.. నేటితరం సీనియర్ హీరోస్ లో ఎవరికీ దక్కని రీతిలో ఈ చిత్రంతో రూ.300 కోట్ల క్లబ్ లోకి చేరాడు. అయితే.. అంతటి సంచలన విజయం సాధించిన తర్వాత కూడా వెంకటేష్ నుంచి కొత్త సినిమాకి సంబంధించి అప్డేట్ రాలేదు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ నెక్స్ట్ మూవీ చేయబోతున్నాడనే న్యూస్ కొన్ని రోజులుగా వినిపిస్తుంది. ఈ సినిమా ఫిక్సవ్వడం, ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టుకోవడం కూడా జరిగిందనేది ఇండస్ట్రీ టాక్. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ పేరు ప్రచారంలోకి వచ్చింది.
మొత్తానికి.. జూన్ 6న వెంకీ-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన రావొచ్చనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరందుకుంది. ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించనుందట.
-
Home
-
Menu