జూన్ 12న 'వీరమల్లు'

జూన్ 12న వీరమల్లు
X
ఇప్పటికే పలుమార్లు వాయిదాలు పడిన 'హరిహర వీరమల్లు' లేటెస్ట్ గా కొత్త రిలీజ్ డేట్ ను కన్ఫమ్ చేసుకుంది. జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతుంది.

ఇప్పటికే పలుమార్లు వాయిదాలు పడిన 'హరిహర వీరమల్లు' లేటెస్ట్ గా కొత్త రిలీజ్ డేట్ ను కన్ఫమ్ చేసుకుంది. జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతుంది. మొఘలుల కాలం నాటి కథతో పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్ లో 'హరి హర వీరమల్లు' రాబోతుంది.

ఈ సినిమాలో వీరుడైన దొంగ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ మూవీలో పవన్ కి జోడీగా నిధి అగర్వాల్ నటించగా.. కీలక పాత్రల్లో బాబీ డియోల్, సునీల్, సత్యరాజ్, జిషు సేన్ గుప్తా వంటి వారు కనిపించబోతున్నారు. ఆస్కార్ విజేత కీరవాణి సంగీతం 'వీరమల్లు'కి అదనపు ఆకర్షణ.

సీనియర్ ప్రొడ్యూసర్ ఎ.ఎమ్.రత్నం నిర్మాణంలో క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ సంయుక్తంగా 'హరి హర వీరమల్లు'ని తెరకెక్కించారు. ఈసారి షూటింగ్ పూర్తవ్వడంతో జూన్ 12న 'హరి హర వీరమల్లు' ఖచ్చితంగా థియేటర్లలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.



Tags

Next Story