కుమారుడి పేరు తెలిపిన వరుణ్-లావణ్య

మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు సెప్టెంబర్ 10న మగ బిడ్డకు జన్మనిచ్చారు. తమ కుమారుడు పేరును దసరా సందర్భంగా సోషల్ మీడియాలో ప్రకటించారు. హనుమంతుడి ఆశీర్వాదాలతో తమ కొడుకు పేరు ‘వాయువ్ తేజ్ కొణిదెల‘గా పెట్టినట్టు తెలిపారు. వరుణ్ తేజ్ కొన్ని ఫొటోలను షేర్ చేస్తూ అభిమానుల దీవెనలు కోరాడు.
చిరంజీవి పేరు కూడా హనుమంతుడి నామమే. చిరంజీవి పేరు కూడా కలిసొచ్చేటట్టు వరుణ్ తన కుమారుడికి వాయువ్ తేజ్ అని పెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు‘ చిత్రంతో బిజీగా ఉన్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మరోవైపు లావణ్య సైతం పెళ్లి తర్వాత సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం లావణ్య నటిస్తున్న ‘సతీలీలావతి‘ విడుదలకు ముస్తాబవుతుంది.
Our greatest blessing now has a name.🤍 pic.twitter.com/sGEk9HzBuc
— Varun Tej Konidela (@IAmVarunTej) October 2, 2025
-
Home
-
Menu