మెగా ఫ్యామిలీలో సంతోష వేళ

మెగా ఫ్యామిలీలో సంతోష వేళ
X
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.ఈ జంట తాము తల్లిదండ్రులు కాబోతున్నామని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించి అభిమానులను ఆనందంలో ముంచెత్తారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్న పాదరక్షలు (బేబీ షూస్) ఫొటోను షేర్ చేసిన వీరు, ‘జీవితంలో అత్యంత అందమైన పాత్ర పోషించబోతున్నాం‘ అనే సందేశంతో తాము తల్లిదండ్రులు కాబోతున్న వార్తను పంచుకున్నారు.

కొన్నేళ్లు ప్రేమలో ఉన్న వీరు 2023లో ఇటలీలో జరిగిన పెళ్లితో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు ఈ తీపి కబురు మెగా ఫ్యామిలీలో మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో వీరికి శుభాకాంక్షల తెలియజేస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం వరుణ్ తేజ్.. మేర్లపాక గాంధీ సినిమాతో బిజీగా ఉన్నాడు.



Tags

Next Story