'ఉస్తాద్ భగత్ సింగ్' టైమ్!

ఉస్తాద్ భగత్ సింగ్ టైమ్!
X
కొంతమంది నటులు కొన్ని తరహా పాత్రలలో అదరగొడతారు. అలాగే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే పోలీస్ రోల్ లో తన పవర్ చూపిస్తూ ఉంటాడు. పోలీస్ డ్రెస్ లో ఒకవైపు తన పవర్ చూపిస్తూనే.. మరోవైపు తనదైన కామెడీని పండించడం పవర్ స్టార్ స్టైల్.

‘గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్, హరీష్ శంకర్ కాంబోలో రూపొందుతోన్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కూడా ‘గబ్బర్ సింగ్' తరహాలోనే కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ దక్కింది.

అయితే.. పవర్ స్టార్ పాలిటిక్స్ తో బిజీగా ఉండడంతో బ్రేక్ పడ్డ సినిమాల జాబితాలో 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా ఉంది. ఈ సినిమా నుంచి బ్రేక్ రావడంతోనే మధ్యలో డైరెక్టర్ హరీష్ శంకర్.. రవితేజాతో 'మిస్టర్ బచ్చన్' చేశాడు. ఇప్పుడు మళ్లీ పవన్ సినిమాలు వరుసగా తిరిగి పట్టాలెక్కుతున్నాయి.

ఇప్పటికే 'హరిహర వీరమల్లు'ని ఫినిష్ చేసి 'ఓజీ'ని మొదలు పెట్టిన పవన్.. త్వరలో 'ఉస్తాద్ భగత్ సింగ్'ను సైతం మొదలు పెట్టబోతున్నాడు. ఇదే విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలుపుతూ హనుమాన్ జయంతి సందర్భంగా 'ఉస్తాద్..' నుంచి ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి జోడీగా శ్రీలీల నటిస్తుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

Tags

Next Story