ట్రంప్‌ టారిఫ్స్.. టాలీవుడ్‌కు షాక్‌

ట్రంప్‌ టారిఫ్స్.. టాలీవుడ్‌కు షాక్‌
X
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి సంచలన నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా చర్చకు తెరలేపారు. అమెరికా బయట నిర్మితమయ్యే ఏ సినిమా అయినా ఇకపై 100% టారిఫ్ కిందకి వస్తుందని ప్రకటించడంతో సినిమా రంగం ఒక్కసారిగా షాక్‌కు గురైంది.

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి సంచలన నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా చర్చకు తెరలేపారు. అమెరికా బయట నిర్మితమయ్యే ఏ సినిమా అయినా ఇకపై 100% టారిఫ్ కిందకి వస్తుందని ప్రకటించడంతో సినిమా రంగం ఒక్కసారిగా షాక్‌కు గురైంది.

‘మన సినిమా వ్యాపారాన్ని ఇతర దేశాలు చిన్నపిల్లాడి దగ్గర నుండి మిఠాయి దొంగిలించినట్లుగా దొంగిలిస్తున్నాయి‘ అని ట్రంప్ ఆరోపించడం ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రకటన తర్వాత నెట్‌ఫ్లిక్స్‌ షేర్లు 1.5% పడిపోవడం ఆ ప్రభావానికి నిదర్శనం. అయితే ఈ టారిఫ్‌లు అమలు చేయగలరా? అన్నదానిపై నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

అందుకు ప్రధాన కారణం.. ప్రస్తుతం అమెరికాలో రూపొందుతున్న హాలివుడ్ చిత్రాలు సైతం కొన్ని విదేశీ నిర్మాణ సంస్థలు సహ నిర్మాతలుగా రూపొందుతుండటమే. షూటింగ్, పోస్ట్‌ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్‌ అనేక దేశాల్లో జరుగుతున్నాయి. అప్పుడు ఏ సినిమాను విదేశీ నిర్మాణంగా వర్గీకరించాలి? అన్న ప్రశ్న పెద్ద సమస్యగా మారింది.

మరోవైపు ట్రంప్ నిర్ణయం మన తెలుగు సినిమాలపైనా పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది. మన టాలీవుడ్ మూవీస్ కి ఓవర్సీస్ లో నార్త్ అమెరికా పెద్ద మార్కెట్. లేటెస్ట్ గా రిలీజైన ‘ఓజీ‘ చిత్రం కేవలం అమెరికాలోనే 5 మిలియన్ల డాలర్లు వసూలు చేసింది. అంటే.. దాదాపు 50 కోట్లు అమెరికా నుంచే వచ్చింది. ‘మిరాయ్‘ సినిమా 3 మిలియన్ల డాలర్లు వసూలు చేసింది. మొత్తంగా.. ట్రంప్ నిర్ణయం గ్లోబల్‌ ఎంటర్టైన్‌మెంట్ ఎకానమీకి కొత్త గందరగోళాన్ని తెచ్చే అవకాశం కనిపిస్తోంది.

Tags

Next Story