ట్రాన్స్ ఆఫ్ ‘కుబేర‘

కింగ్ నాగార్జున, విలక్షణ నటుడు ధనుష్ కలయికలో రూపొందుతున్న చిత్రం ‘కుబేర‘. నేషనల్ క్రష్ రష్మిక కథానాయికగా నటిస్తుంది. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా జూన్ 20న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర‘ పేరుతో స్పెషల్ టీజర్ రిలీజ్ చేశారు.
ఇప్పటికే ‘కుబేర‘ నుంచి వచ్చిన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ దక్కింది. అయితే.. ఇప్పటివరకూ వచ్చిన ప్రచార చిత్రాలలో ఆయా పాత్రలకు సంబంధించిన గ్లింప్సెస్ రిలీజ్ చేశారు. కానీ.. ఇప్పుడు ‘ట్రాన్స్ ఆఫ్ ‘కుబేర‘లో అసలు కంటెంట్ ను వదిలారు. ఇదే అసలు సిసలు టీజర్ అని టీమ్ సైతం చెప్పింది.
రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో.. ‘నాది నాది నాదే ఈ లోకమంతా‘ అంటూ సాగే లిరిక్స్ తో ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర‘ ఆకట్టుకుంటుంది. లీడ్ రోల్స్ లో కనిపించే నాగార్జున, ధనుష్, రష్మిక, జిమ్ షర్బ్ వంటి వారంతా ఈ టీజర్ లో సందడి చేశారు. మొత్తంగా.. ఈ టీజర్ తో ‘కుబేర‘ కథపై ఆసక్తి మరింత పెరిగిందని చెప్పొచ్చు.
-
Home
-
Menu