జూన్ పైనే ఆశలు!

వేసవి అనగానే తెలుగు సినిమాల బాక్సాఫీస్‌కి పండుగ. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఉండటంతో.. ఈ హాట్ సమ్మర్ లో కూల్ ఎంటర్ టైన్ మెంట్ పంచడానికి పెద్ద సినిమాలు పోటీ పడుతుంటాయి. కానీ.. గడిచిన రెండేళ్లుగా వేసవిలో బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి లేదు.
వేసవిని టార్గెట్ చేస్తూ రావాల్సిన ‘హరిహర వీరమల్లు‘ వంటి సినిమాలు వాయిదా పడటం. ఇండియా-పాకిస్తాన్ వార్ నేపథ్యంలో ‘కింగ్డమ్‘ చిత్రం పోస్ట్ పోన్ అవ్వడం వంటి కారణాలతో.. ఈ సమ్మర్ స్లాట్ నుంచి బడా మూవీస్ తప్పుకున్నాయి.
దీంతో ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఒక్క ‘హిట్ 3‘ తప్ప మరో పెద్ద సినిమా ఏదీ రాలేదు. అలా.. ఈ రెండు నెలలూ బాక్సాఫీస్ ఖాళీగానే సాగిపోయింది. అయితే.. సమ్మర్ సందడి ముగిసిన తర్వాత జూన్ నెలలో మాత్రం వరుసగా పెద్ద సినిమాలు వస్తుండటం విశేషంగా మారింది.
జూన్ మొదటి వారంలో ‘థగ్ లైఫ్‘ వస్తుంటే.. రెండో వారంలో ‘హరిహర వీరమల్లు‘, మూడో వారంలో ‘కుబేర, సితారే జమీన్ పర్‘, నాల్గవ వారంలో ‘కన్నప్ప‘ వంటి సినిమాలు లైన్లో ఉన్నాయి. ఆ తర్వాత జూలై మొదటి వారంలో ‘కింగ్డమ్‘ చిత్రం బాక్సాఫీస్ కి క్యూ కట్టబోతుంది.
-
Home
-
Menu