‘వీరమల్లు‘ వీరత్వంతో ‘అసుర‘

‘వీరమల్లు‘ వీరత్వంతో ‘అసుర‘
X
పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు‘ ప్రచారంలో స్పీడు పెంచారు. జూన్ 12న విడుదలకు ముస్తాబవుతోన్న ఈ సినిమా నుంచి ఒక్కొక్కటిగా ప్రచార చిత్రాలను విడుదల చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు‘ ప్రచారంలో స్పీడు పెంచారు. జూన్ 12న విడుదలకు ముస్తాబవుతోన్న ఈ సినిమా నుంచి ఒక్కొక్కటిగా ప్రచార చిత్రాలను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ‘మాట వినాలి, కొల్లగొట్టినాదిరో‘ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మూడో పాటను విడుదల చేశారు.

ఆస్కార్ విజేత కీరవాణి స్వరకల్పనలో రాంబాబు గోశాల రాసిన ‘అసుర హననమ్‘ అంటూ సాగే ఈ గీతం ఆకట్టుకుంటుంది. ఐరా ఉడుపి, కాల భైరవ, సాయి చరణ్ భాస్కరుని, లోకేశ్వరి ఈదర, హైమత్ మహమ్మద్ ఈ పాటను ఆలపించారు. ‘వీరమల్లు‘ వీరత్వాన్ని వివరించే గీతంగా ఈ పాట ఆకట్టుకుంటుంది.



Tags

Next Story