మెగా 157 గ్యాంగ్ వీళ్లే!

మెగా 157 గ్యాంగ్ వీళ్లే!
X
ముహూర్తాన్ని జరుపుకుంది మొదలు అప్పుడే మెగాస్టార్ ‘మెగా 157‘ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. తాజాగా ఈ సినిమా టెక్నికల్ టీమ్ ను పరిచయం చేస్తూ.. ‘మెగా 157‘ టీమ్ రిలీజ్ చేసిన ఓ వీడియో ఆకట్టుకుంటుంది.

ఈ ఏడాది సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం‘ చిత్రంతో ఘన విజయాన్నందుకున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఫుల్ లెన్త్ ఎంటర్ టైనర్ గా ‘సంక్రాంతికి వస్తున్నాం‘ను తీర్చిదిద్దడమే కాదు.. ఈ సినిమా ప్రచారాన్ని ఓ రేంజులో హోరెత్తించాడు. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ‘మెగా 157‘తో రాబోతున్నాడు.

ముహూర్తాన్ని జరుపుకుంది మొదలు అప్పుడే మెగాస్టార్ ‘మెగా 157‘ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. తాజాగా ఈ సినిమా టెక్నికల్ టీమ్ ను పరిచయం చేస్తూ.. ‘మెగా 157‘ టీమ్ రిలీజ్ చేసిన ఓ వీడియో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకి పనిచేస్తున్న డైరెక్షన్ డిపార్ట్ మెంట్, రైటర్స్, ప్రొడక్షన్ డిజైనర్ ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటర్ తమ్మిరాజు, సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డి, సంగీత దర్శకుడు భీమ్స్ లతో పాటు నిర్మాతలు సుస్మిత కొణిదెల, సాహు గారపాటి, డైరెక్టర్ అనిల్ రావిపూడి లను మెగాస్టార్ చిరంజీవి పరిచయం చేసుకునే తీరు ఈ వీడియోలో ఆకట్టుకుంటుంది.

మొత్తంగా ‘మెగా 157‘ గ్యాంగ్ అంతా ముక్త కంఠంతో బాక్సాఫీస్ ను రఫ్పాడించేద్దాం‘ అంటూ చెబుతున్నారు. మరి.. వచ్చే సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావిపూడి ఏ రేంజులో సక్సెస్ అందిస్తాడో చూడాలి.



Tags

Next Story