గాయాల వెనుక దాగిన గాథ

గాయాల వెనుక దాగిన గాథ
X
కన్నడ స్టార్‌ రిషబ్‌ శెట్టి మరోసారి తన ప్రతిభతో దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించాడు. ‘కాంతార: చాప్టర్ 1’ విడుదలైన తొలి రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.

కన్నడ స్టార్‌ రిషబ్‌ శెట్టి మరోసారి తన ప్రతిభతో దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించాడు. ‘కాంతార: చాప్టర్ 1’ విడుదలైన తొలి రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ పాన్‌ ఇండియా మైథలాజికల్‌ యాక్షన్‌ డ్రామా కన్నడతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ అత్యద్భుతమైన వసూళ్లను కొల్లగొడుతుంది. ఇప్పటికే రూ.600 కోట్లు దాటి రూ.700 కోట్లకు చేరువలో ఉంది.

‘కాంతార‘ మూవీకి ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాకి హీరోగా, డైరెక్టర్ గా తన డెడికేషన్ చూపించాడు రిషబ్ శెట్టి. ఈ మూవీ షూటింగ్‌ సమయంలో తాను ఎదుర్కొన్న గాయాల ఫోటోలు సోషల్‌ మీడియాలో పంచుకుంటూ, ‘ఈ విజయం వెనుక ఉన్నది కేవలం కృషి కాదు, దైవానుగ్రహం‘ అని రిషబ్‌ భావోద్వేగంగా పేర్కొన్నాడు.

హోంబలే ఫిలింస్‌ నిర్మించిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్‌, గుల్షన్‌ దేవయ్య, జయరామ్‌ ఇతర ముఖ్య పాత్రలు పోషించగా, అజనీష్‌ లోకనాథ్‌ సంగీతం అదనపు బలాన్ని ఇచ్చింది. మొత్తానికి రిషబ్‌ శెట్టి తన నమ్మకాన్ని, శ్రమను, భక్తిని ‘కాంతార చాప్టర్ 1‘తో మరోసారి చూపించాడు. లేటెస్ట్ గా ‘కాంతార చాప్టర్ 1‘ నుంచి సక్సెస్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.




Tags

Next Story