'మిరాయ్'లో ప్రభాస్ వాయిస్ వెనుక కథ?

మిరాయ్లో ప్రభాస్ వాయిస్ వెనుక కథ?
X
లేటెస్ట్ టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ 'మిరాయ్'లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది రెబల్ స్టార్ ప్రభాస్ వాయిస్ ఓవర్. పురాణాలు, ఇతిహాసాల వైభవాన్ని చెబుతూ కథా నేపథ్యాన్ని వివరించిన తీరు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది.

లేటెస్ట్ టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ 'మిరాయ్'లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది రెబల్ స్టార్ ప్రభాస్ వాయిస్ ఓవర్. పురాణాలు, ఇతిహాసాల వైభవాన్ని చెబుతూ కథా నేపథ్యాన్ని వివరించిన తీరు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఆయన తన సినిమాల్లో చెప్పిన డైలాగ్‌ల కంటే ఇది బలంగా, ప్రభావవంతంగా ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

అయితే వాయిస్‌లో స్పీడ్ ఎక్కువగా ఉండటంతో ఇది నిజంగానే ప్రభాస్ స్వరమేనా? లేక ఏఐ టెక్నాలజీ వాడారా? అనే చర్చలు సోషల్ మీడియాలో చెలరేగాయి. దీనిపై దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని క్లారిటీ ఇచ్చాడు. ప్రతి డైలాగ్ ప్రభాస్ స్వయంగా డబ్బింగ్ చెప్పాడని, కేవలం టెక్నాలజీ సాయంతో స్పీడ్ పెంచామని, దాని వెనుక ఉద్దేశ్యం రన్ టైమ్ తగ్గించడమేనని ఆయన తెలిపాడు.

ఈ వివరణతో ఏఐ ఊహాగానాలకు తెరపడినా.. ఒక విషయం మాత్రం స్పష్టం అయింది. ప్రభాస్ వాయిస్‌లో కొంచెం స్పీడు పెరిగితే, ఆయన డెలివరీ మరింత బలంగా, ఆకర్షణీయంగా అనిపిస్తుందని ప్రేక్షకుల అభిప్రాయం. ప్రభాస్ వాయిస్ ఓవర్ 'మిరాయ్' విజువల్ ఎక్స్‌పీరియన్స్‌కి అదనపు మేజిక్‌ను జోడించిందనే మాట వాస్తవమే.

Tags

Next Story