ఎట్టకేలకు రిలీజైన ‘కుబేర‘ పాట!

మాస్ మసాలా చిత్రాలు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో భావోద్వేగాలను, మానవ జీవితంలోని అసలు వాస్తవాలను హృదయంగా చూపించే సినిమాలు అరుదు. అలాంటి చిత్రంగా రాబోతుంది ‘కుబేర‘. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున, ధనుష్, రష్మిక వంటి తారాగాణం ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. జూన్ 20న పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ మూవీ ప్రమోషన్స్ మరింత జోరందుకున్నాయి.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి రెండు పాటలు రాగా.. వాటికి మంచి స్పందన వచ్చింది. లేటెస్ట్ గా ‘పిప్పి పిప్పి డుం డుం‘ అంటూ సాగే సాంగ్ రిలీజయ్యింది. అసలు నిన్న ముంబై వేదికగా విడుదలవ్వాల్సిన ఈ పాట టెక్నికల్ ప్రాబ్లమ్ వలన ఆలస్యమయ్యింది.
నేషనల్ క్రష్ రష్మికపై చిత్రీకరించిన ఈ గీతం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. చైతన్య పింగళి రచనలో ఇంద్రావతి చౌహాన్ ఎనర్జిటిక్ గా ఈ సాంగ్ ఆలపించింది. రష్మిక ఆకట్టుకునే డాన్స్ మూవ్స్, విజువల్స్ ఈ పాటలో ప్రధాన హైలైట్గా నిలిచాయి. మొత్తంగా శేఖర్ కమ్ముల స్టైల్ లో రియలిస్ట్ గా ఈ పాట బాగుంది.
-
Home
-
Menu