‘కుబేర‘ నుంచి ‘అనగనగా కథ‘

X
ఈనెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రాలలో ‘కుబేర‘ ఎంతో ప్రత్యకమైనది. టాలీవుడ్ కింగ్ నాగార్జున, కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఇది.
ఈనెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రాలలో ‘కుబేర‘ ఎంతో ప్రత్యకమైనది. టాలీవుడ్ కింగ్ నాగార్జున, కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఇది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ‘కుబేర‘పై మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ స్వరకల్పనలో రూపొందిన ‘కుబేర‘ ఆల్బమ్ ను ఇటీవల చెన్నైలో గ్రాండ్ గా లాంఛ్ చేశారు.
లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ‘అనగనగా కథ‘ అంటూ సాగే పాట విడుదలైంది. దేవిశ్రీ అందించిన బాణీకి చంద్రబోస్ లిరిక్స్ రాయగా హైడ్ కార్తీ, కరీముల్లా ఇంటెన్స్ గా ఆలపించారు. డబ్బు చుట్టూ తిరిగే ఈ కథలో ఎమోషన్స్ కు తావు లేదు అన్నట్టుగా ఈ పాట సాగుతుంది. జూన్ 20న ‘కుబేర‘ థియేటర్లలోకి రాబోతుంది.
Next Story
-
Home
-
Menu