మెగా 157 షూటింగ్ కి ముహూర్తం!

మెగా 157 షూటింగ్ కి ముహూర్తం!
X
మెగా 157 షూటింగ్ కి ముహూర్తం ఫిక్సయ్యింది. ఈ సినిమా మే 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టుకోనుందట. ఫస్ట్ డే నుంచే మెగాస్టార్ చిరంజీవి షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది.

మెగా 157 షూటింగ్ కి ముహూర్తం ఫిక్సయ్యింది. ఈ సినిమా మే 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టుకోనుందట. ఫస్ట్ డే నుంచే మెగాస్టార్ చిరంజీవి షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. అపజయమెరుగని అనిల్ రావిపూడి పక్కా ప్లానింగ్ తో ‘మెగా 157‘ని తీర్చిదిద్దుతున్నాడు.

ఈ చిత్రాన్ని రెండు, మూడు షెడ్యూల్స్ లో పూర్తి చేయడానికి కసరత్తులు చేస్తున్నాడట అనిల్. ఇక తన సినిమాలకు సంబంధించి మేకింగ్ విషయంలోనే కాదు.. ప్రచార కార్యక్రమాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్. ‘మెగా 157‘ మూవీ షూటింగ్ మొదలయినప్పుడు కూడా ఓ ఆసక్తికర ప్రమోషనల్ వీడియోని వదలడానికి ప్రణాళిక చేస్తున్నాడట.

మెగాస్టార్ నుంచి చాలా గ్యాప్ తర్వాత రాబోతున్న ఫుల్ లెన్త్ ఎంటర్ టైనర్ ఇది. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తుంది. మరో నాయికగా కేథరిన్ కనిపించనుందనే ప్రచారం ఉంది. ఇప్పటికే ఈ సినిమాకోసం భీమ్స్ ఎనర్జిటిక్ ట్యూన్స్ సిద్ధం చేశాడట. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వచ్చే సంక్రాంతికి రఫ్పాడించేద్దాం అంటూ సిద్ధమవుతుంది ‘మెగా 157‘ టీమ్.

Tags

Next Story