‘కాంతార’ వెనుక అసలు కథ

‘కాంతార’ – పేరు చెప్పగానే ప్రకృతి, సంస్కృతి, భక్తి, రహస్యాల మేళవింపు గుర్తుకు వస్తుంది. అసలు ఈ మైథలాజికల్ ఫాంటసీ స్టోరీకి స్ఫూర్తి తాను ఎక్కడ నుంచి తీసుకున్నాడో వివరించాడు డైరెక్టర్ కమ్ యాక్టర్ రిషబ్ శెట్టి.
సుమారు 20 ఏళ్ల క్రితం ఆయన గ్రామంలో ఒక రైతు, అటవీ అధికారికి మధ్య భూమి వివాదం చోటుచేసుకుంది. సాధారణంగా ఇది ఇద్దరి మధ్య గొడవగా కనిపించినా, రిషబ్ దానిని 'మానవ అవసరాలు vs ప్రకృతి హక్కులు' అనే లోతైన దృష్టితో చూశాడట. ఈ ఆలోచన ‘కాంతార’ కథకు బీజం వేసింది.. అని చెప్పాడు రిషబ్.
సినిమా క్లైమాక్స్ గురించి మాట్లాడుతూ.. 'ఆ సన్నివేశాలను నేను ఊహించుకున్నాను కానీ, నిజంగా వాటిని రాయించింది మరొక శక్తి. నాకు అది ఒక అతీత అనుభూతి' అని తెలిపాడు. ప్రస్తుతం ‘కాంతార చాప్టర్ 1’ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. విడుదలైన మొదటి రోజే రూ. 89 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ వీకెండ్ కి రూ. 300 కోట్ల దిశగా దూసుకెళ్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండిట్స్.
-
Home
-
Menu