నంది అవార్డులు తిరిగి రానున్నాయి!

నంది అవార్డులు తిరిగి రానున్నాయి!
X
ఆంధ్రప్రదేశ్‌లో చలనచిత్ర పరిశ్రమకు మరింత బలం చేకూర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గత కొంతకాలంగా నిలిచిపోయిన నంది అవార్డులును తిరిగి ప్రారంభించనున్నట్టు సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌లో చలనచిత్ర పరిశ్రమకు మరింత బలం చేకూర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గత కొంతకాలంగా నిలిచిపోయిన నంది అవార్డులును తిరిగి ప్రారంభించనున్నట్టు సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.సినీ, నాటక రంగాల్లో ప్రతిభ కనబరిచినవారిని గౌరవించాలనే లక్ష్యంతో ఈ అవార్డులను పునరుద్ధరించనున్నారు.

ఏలూరులో జరిగిన 'భైరవం' ట్రైలర్ విడుదల కార్యక్రమం సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వైజాగ్‌ను హైదరాబాద్ తరహాలో సినిమాల కేంద్రంగా తీర్చిదిద్దే ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. సినిమా షూటింగ్‌లకు అనువైన ప్రదేశాల అభివృద్ధి, స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్లు, రీరికార్డింగ్ సదుపాయాల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేకంగా పాలసీ రూపొందిస్తోంది అని తెలిపారు.

సినిమా రంగ అభివృద్ధికి ప్రభుత్వం నుండి నూటికి నూరు శాతం మద్దతు ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. 'రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా నటుడు పవన్ కల్యాణ్ ఉన్నారు. ఇది చిత్ర పరిశ్రమకు అనుకూలమైన వాతావరణాన్ని తీసుకురానుంది' అని మంత్రి అభిప్రాయపడ్డారు.

ఈ క్రమంలో 'నంది నాటక ఉత్సవం' పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఏపీలో సినీ రంగానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడమే కాకుండా, హైదరాబాద్‌లో ఉన్న ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, నటులతో సమావేశమై, వారిని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించనున్నట్లు తెలిపారు.

Tags

Next Story