మంచు వారసుల మ్యూజికల్ అరంగేట్రం!

మంచు వారసుల మ్యూజికల్ అరంగేట్రం!
X
విష్ణు నటిస్తూ నిర్మిస్తున్న ‘కన్నప్ప‘ చిత్రం మంచు కుటుంబానికి ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్. నటప్రపూర్ణ మోహన్ బాబు ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపిస్తున్నారు.

విష్ణు నటిస్తూ నిర్మిస్తున్న ‘కన్నప్ప‘ చిత్రం మంచు కుటుంబానికి ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్. నటప్రపూర్ణ మోహన్ బాబు ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. అలాగే విష్ణు ‘కన్నప్ప‘గా టైటిల్ రోల్ లో నటిస్తుండగా.. ఆయన కుమారుడు, కుమార్తెలు కూడా నటీనటులుగా అలరించబోతున్నారు.

లేటెస్ట్ గా ‘కన్నప్ప‘ నుంచి ‘శ్రీ కాళహస్తి‘ అంటూ సాగే లిరికల్ వీడియో రాబోతుంది. అందుకు సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు. ఈ పాట ప్రత్యేకత ఏమిటంటే.. విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా నటించడం. వీరిద్దరూ ‘శ్రీ కాళహస్తి‘ మహత్యం గురించి వివరిస్తూ పాడిన గీతంగా సినిమాలో ఈ పాట ఉండబోతుంది.

స్టీఫెన్ దేవస్సీ మ్యూజిక్ లో సుద్దాల అశోక్ తేజ ఈ పాటను అరియానా-వివియానా ఆలపించడం విశేషం. రేపు (మే 28) ఈ ఫుల్ సాంగ్ రాబోతుంది. మరోవైపు.. జూన్ 27న ‘కన్నప్ప‘ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కు రెడీ అవుతుంది.



Tags

Next Story