‘విశ్వంభర’ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

‘విశ్వంభర’ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది
X
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటింగ్ మూవీ ‘విశ్వంభర‘. ‘బింబిసార‘తో సంచలనం సృష్టించిన దర్శకుడు వశిష్ఠ ఈ సినిమాను పూర్తిగా సోషియో-ఫాంటసీ నేపథ్యంలో తీర్చిదిద్దుతున్నాడు.

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటింగ్ మూవీ ‘విశ్వంభర‘. ‘బింబిసార‘తో సంచలనం సృష్టించిన దర్శకుడు వశిష్ఠ ఈ సినిమాను పూర్తిగా సోషియో-ఫాంటసీ నేపథ్యంలో తీర్చిదిద్దుతున్నాడు. యు.వి. క్రియేషన్స్ సంస్థ దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ‘విశ్వంభర‘ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చింది. ‘రామ రామ శ్రీరామ‘ అంటూ సాగే ఈ గీతం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. చిరంజీవి స్వరంలో వచ్చే ‘జై శ్రీరామ్‘ శబ్దం పాటకు డివోషనల్ వైబ్‌ను తీసుకొచ్చింది. ఇందులో హనుమంతునిపై చిరు ప్రేమ, భక్తి స్పష్టంగా కనిపిస్తోంది. కీరవాణి సంగీతంలో రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను శంకర్ మహదేవన్, లిప్సిక ఆలపించారు.

చిరు సరసన త్రిష ప్రధాన నాయికగా నటిస్తుండగా, ఆశికా రంగనాథ్, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి, బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తిచేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ ఏడాది జూలై 24న ఈ సినిమాని విడుదల చేస్తారనే ప్రచారం ఉంది.



Tags

Next Story