సెన్సార్ టాక్ అదిరింది!

సెన్సార్ టాక్ అదిరింది!
X
నందమూరి కళ్యాణ్ రామ్ 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' రిలీజ్ కు రెడీ అవుతుంది. తల్లీకొడుకుల బంధాన్ని కొత్త కోణంలో ఆవిష్కరించబోతున్న ఈ సినిమాలో తల్లిగా విజయశాంతి కనిపించబోతుంది.

నందమూరి కళ్యాణ్ రామ్ 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' రిలీజ్ కు రెడీ అవుతుంది. తల్లీకొడుకుల బంధాన్ని కొత్త కోణంలో ఆవిష్కరించబోతున్న ఈ సినిమాలో తల్లిగా విజయశాంతి కనిపించబోతుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోక క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

ఏప్రిల్ 18న విడుదలకు ముస్తాబవుతోన్న 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' లేటెస్ట్ గా సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ మూవీకి U/A సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ సినిమా రన్‌టైమ్ 2 గంటల 24 నిమిషాలు.

సెన్సార్ టాక్ ప్రకారం ఈ సినిమా ఒక ఎమోషనల్ యాక్షన్ ట్రీట్. ముఖ్యంగా క్లైమాక్స్ ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుందట. ఎవరూ ఊహించని విధంగా ఈ మూవీ క్లైమాక్స్ ఉండబోతుందట. విజయశాంతి పోషించిన పవర్‌ఫుల్ పోలీస్ క్యారెక్టర్.. అలాగే కళ్యాణ్ రామ్ చేసిన అర్జున్ క్యారెక్టర్ లో వేరియేషన్స్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయట.

ప్రదీప్ చిలుకూరి ప్రెజెంటేషన్, అజనీష్ లోక్‌నాథ్ బి.జి.ఎమ్, సాంగ్స్ సనిమాకి ప్లస్ పాయింట్ అనే టాక్ సెన్సార్ నుంచి వినిపిస్తుంది. మొత్తంగా.. 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'తో కళ్యాణ్ రామ్ ఖాతాలో హిట్ పడుతుందేమో చూడాలి.

Tags

Next Story