‘తమ్ముడు‘ ట్రైలర్ అప్డేట్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ టైటిల్ తో వస్తోన్న నితిన్ చిత్రం ‘తమ్ముడు‘. ‘వకీల్ సాబ్‘ ఫేమ్ శ్రీరామ్ వేణు దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్, రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముందుగా ఈ సినిమాని జూలై 4న విడుదల చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్‘ కోసం ‘తమ్ముడు‘ తప్పుకుంది.
మళ్లీ ఇప్పుడు జూలై 4నే ‘తమ్ముడు‘ థియేటర్లలోకి రాబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. జూన్ 11న ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. ట్రైలర్ తోనే సినిమాకి సంఅన్ని విషయాలపైనా క్లారిటీ వస్తుందని మూవీ టీమ్ ఓ ఆసక్తికర గ్లింప్స్ రిలీజ్ చేసింది.
ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లయ కీలక పాత్రలో కనిపించబోతుంది. సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, స్వసిక ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మొత్తంగా.. ‘రాబిన్ హుడ్‘ నిరాశపరచడంతో ఇప్పుడు ‘తమ్ముడు‘పైనే ఆశలు పెట్టుకున్నాడు నితిన్.
-
Home
-
Menu