‘తమ్ముడు‘ రిలీజ్ డేట్ ఫిక్స్

‘తమ్ముడు‘ రిలీజ్ డేట్ ఫిక్స్
X
యూత్ స్టార్ నితిన్ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. గత చిత్రం ‘రాబిన్ హుడ్‘ అయితే బాగా నిరాశపరిచింది. ఈనేపథ్యంలో ఇప్పుడు తన ఆశలన్నీ ‘తమ్ముడు‘ చిత్రంపైనే పెట్టుకున్నాడు.

యూత్ స్టార్ నితిన్ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. గత చిత్రం ‘రాబిన్ హుడ్‘ అయితే బాగా నిరాశపరిచింది. ఈనేపథ్యంలో ఇప్పుడు తన ఆశలన్నీ ‘తమ్ముడు‘ చిత్రంపైనే పెట్టుకున్నాడు. ‘వకీల్ సాబ్‘ ఫేమ్ శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు.

అక్కా తమ్ముడి అనుబంధం నేపథ్యంలో ‘తమ్ముడు‘ రూపొందుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో అక్క పాత్రలో సీనియర్ బ్యూటీ లయ కనిపించబోతుంది. ‘కాంతార‘ ఫేమ్ సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ నితిన్ కి జోడీగా నటిస్తున్నారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు.. యాక్షన్ కు పెద్ద పీట వేస్తూ ‘తమ్ముడు‘ తయారవుతుంది.

లేటెస్ట్ గా ‘తమ్ముడు‘ రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. జూలై 4న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది టీమ్. ఈరోజు డైరెక్టర్ శ్రీరామ్ వేణు బర్త్ డే స్పెషల్ గా ఓ ఆసక్తికర వీడియోతో ‘తమ్ముడు‘ విడుదల తేదీని ప్రకటించారు.



Tags

Next Story