'తమ్ముడు' ఫస్ట్ సింగిల్ ప్రోమో!

X
యూత్ స్టార్ నితిన్ ప్రధాన పాత్రలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘తమ్ముడు’. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 4న విడుదల కానుంది.
యూత్ స్టార్ నితిన్ ప్రధాన పాత్రలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘తమ్ముడు’. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 4న విడుదల కానుంది. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ లయ సిస్టర్ రోల్ లో కనిపించబోతుంది. సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, స్వసిక విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రాగా.. లేటెస్ట్ గా ఫస్ట్ సింగిల్ రాబోతుంది.
‘భూ అంటే భూతం’ అనే లిరికల్ సాంగ్‌ను ఈరోజు సాయంత్రం విడుదల చేయబోతున్నారు. అందుకు సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు. హీరో తన మేనకోడలిని ఆడించే సందర్భంలో చిత్రీకరించిన ఈ పాటను అజనీష్ లోకనాథ్ స్వరపరిచగా సింహాచలం మన్నెల రాసిన ఈ గీతాన్ని అనురాగ్ కులకర్ణి, అక్షిత పోలా ఆలపించారు. ఈ లిరికల్ సాంగ్ ప్రోమో ఆకట్టుకుంటుంది.
Next Story
-
Home
-
Menu