సూర్య-46 షురూ!

సూర్య-46 షురూ!
X
తమిళ విలక్షణ నటుడు సూర్య చాలా గ్యాప్ తర్వాత తెలుగులో ఓ స్ట్రెయిట్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘రక్త చరిత్ర‘ సిరీస్ తర్వాత సూర్య నటిస్తున్న స్ట్రెయిట్ తెలుగు మూవీ సూర్య 46.

తమిళ విలక్షణ నటుడు సూర్య చాలా గ్యాప్ తర్వాత తెలుగులో ఓ స్ట్రెయిట్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘రక్త చరిత్ర‘ సిరీస్ తర్వాత సూర్య నటిస్తున్న స్ట్రెయిట్ తెలుగు మూవీ సూర్య 46. ‘లక్కీ భాస్కర్‘ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఎంతో ప్రెస్టేజియస్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళంలోనూ సైమల్టేనియస్ గా తెరకెక్కిస్తున్నారు. సూర్యకి జోడీగా ‘ప్రేమలు‘ ఫేమ్ మమిత బైజు నటిస్తుంది. ఇతర కీలక పాత్రల్లో రవీనా టాండన్, రాధిక కనిపించనున్నారు. జి.వి.ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో సూర్య 46 షూటింగ్ షురూ అయ్యింది.



Tags

Next Story