‘ఓజీ’ ఫ్యాన్స్‌కి సర్ప్రైజ్ గిఫ్ట్

‘ఓజీ’ ఫ్యాన్స్‌కి సర్ప్రైజ్ గిఫ్ట్
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్‌బస్టర్ ‘ఓజీ’ థియేటర్లలో సందడి చేస్తోంది. ఇప్పటికే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ రూ.300 కోట్ల క్లబ్ లోకి ఎంటరవ్వబోతుంది. లేటెస్ట్ గా 'ఓజీ' ఫ్యాన్స్ కోసం స్పెషల్ సర్ప్రైజ్ అందించారు మేకర్స్.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్‌బస్టర్ ‘ఓజీ’ థియేటర్లలో సందడి చేస్తోంది. ఇప్పటికే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ రూ.300 కోట్ల క్లబ్ లోకి ఎంటరవ్వబోతుంది. లేటెస్ట్ గా 'ఓజీ' ఫ్యాన్స్ కోసం స్పెషల్ సర్ప్రైజ్ అందించారు మేకర్స్. ఈ చిత్రంలో నుంచి తొలగించిన స్పెషల్ సాంగ్ ‘కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్’ను తిరిగి థియేటర్లలో యాడ్ చేశారు.

అందాల భామ నేహా శెట్టి ఈ పాటలో తన ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్‌తో తెరపై తుఫాను సృష్టించింది. తమన్ అందించిన బీట్స్ స్క్రీన్‌ను కదిలించేంత మాస్ ఎనర్జీతో ఉన్నాయి. థియేటర్లలో ఈ పాట వస్తే చాలు ప్రేక్షకులు సీట్లు వదిలి డ్యాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇమ్రాన్ హష్మీ ఎంట్రీ సీన్ తర్వాత వచ్చే ఈ స్పెషల్ సాంగ్‌లో పవన్ కళ్యాణ్ కనిపించకపోయినా, నేహా శెట్టి స్టెప్పులు మాత్రం ఆ లోటు మర్చిపోయేలా ఉన్నాయి.



Tags

Next Story