‘సన్నీ సంస్కారి కీ తులసీ కుమారి‘ ట్రైలర్

‘సన్నీ సంస్కారి కీ తులసీ కుమారి‘ ట్రైలర్
X
బాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రొమాంటిక్ కామెడీ ‘సన్నీ సంస్కారి కి తులసీ కుమారి‘ ట్రైలర్‌ రిలీజయ్యింది. వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ చిత్రానికి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించారు.

బాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రొమాంటిక్ కామెడీ ‘సన్నీ సంస్కారి కి తులసీ కుమారి‘ ట్రైలర్‌ రిలీజయ్యింది. వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ చిత్రానికి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సాన్య మల్హోత్రా, రోహిత్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.

ట్రైలర్‌ చూస్తుంటే కామెడీ, డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో నిండిన ఫుల్ ఎంటర్టైనర్ అని స్పష్టమవుతోంది. సన్నీ (వరుణ్) తన ప్రేమను బాహుబలి స్టైల్లో ప్రపోజ్ చేయగా, అనన్య (సాన్యా మల్హోత్రా) నిరాకరిస్తుంది. మరోవైపు విక్రమ్ (రోహిత్ సారాఫ్) తులసీ (జాన్వీ)కి బ్రేకప్ చెబుతాడు. ఈ ఇద్దరూ తమ ఎక్స్‌ల పెళ్లి ప్లాన్‌ను అడ్డుకోవాలని కలసి ముందుకు వెళ్తారు. కానీ ఆ ప్రయాణంలో సన్నీ–తులసీ మధ్య అనుకోని కెమిస్ట్రీ మొదలవుతుంది. ధర్మా ప్రొడక్షన్స్ పై కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 2న విడుదలవుతుంది.



Tags

Next Story