
సీక్వెల్‌కు బలమైన సంకేతాలు!

తెలుగు సినిమా చరిత్రలో లెజెండరీ కాంబినేషన్‌గా నిలిచిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి' మళ్లీ థియేటర్లలో సందడి చేస్తోంది. విడుదలైన 35 ఏళ్ల తర్వాత ఈరోజు (మే 9) రీ-రిలీజ్ కావడంతో సినిమాను చూసేందుకు మెగాభిమానులు ఎగబడుతున్నారు.
1990లో సినిమా విడుదలైనప్పుడు తెలుగు రాష్ట్రాల్లో భారీ తుఫాన్ వచ్చింది. అయినా.. ఈ చిత్రానికి ఘన విజయాన్ని అందించారు ప్రేక్షకులు. ఇప్పుడు రీ రిలీజ్ లోనూ 'జగదేకవీరుడు అతిలోకసుందరి'కి మంచి రెస్పాన్స్ దక్కుతుంది. ఈసారి త్రీడిలో ఈ చిత్రాన్ని ఆస్వాదిస్తున్నారు ఆడియన్స్.
ఇదిలావుంటే ఈ చిత్రం సీక్వెల్‌పై చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి. లేటెస్ట్ గా రిలీజైన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ఇచ్చిన వీడియో సందేశం దీనికి మరింత బలం చేకూర్చింది. 'జై చిరంజీవా జగదేక వీరా పాట విన్నప్పటినుంచి నాకు ఆంజనేయుడిపై భక్తి పెరిగింది' అంటూ మొదలుపెట్టిన చరణ్, 'ఈ సినిమా చివర్లో చూపిన ఉంగరం, చేప సంగతులు ఇంకా తెలియలేదు. వాటికి సమాధానం చెప్పాలంటే నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేయాలి. ఇది రిక్వెస్ట్ కాదు.. మా తరం డిమాండ్' అంటూ స్పష్టంగా తన అభిప్రాయాన్ని చెప్పేశాడు.
పైగా చిరంజీవి ఇప్పటికే ఈ చిత్రం సీక్వెల్ కోసం చరణ్-జాన్వీ అయితే బాగుంటుందని అభిప్రాయ పడటం.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ కి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఆశీస్సులు అందించడం కూడా జరిగిపోయాయి. మొత్తంగా రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లుగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'జగదేకవీరుడు అతిలోకసుందరి' సీక్వెల్ ఫిక్స్ అయినట్టే అని అభిప్రాయపడుతున్నారు మెగా ఫ్యాన్స్.
-
Home
-
Menu