దిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట

X
దిల్లీ రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18 మందికి పైగా మరణించారు.
10 మందికి పైగా గాయపడ్డారు.
శనివారం రాత్రి రైల్వేస్టేషన్‌కు పెద్దఎత్తున ప్రయాణికులు రావడంతో తొక్కిసలాట జరిగింది.
18మందికి పైగా మరణించారని దిల్లీలోని లోక్‌నాయక్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రీతూ సక్సేనా ధ్రువీకరించారు.
చనిపోయినవారిలో 10 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు రాయిటర్స్ వార్తాసంస్థ వెల్లడించింది.
ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫాం 'ఎక్స్'లో ఆయన మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
రైల్వేస్టేషన్‌లో శనివారం రాత్రి విపరీతమైన రద్దీ ఏర్పడిందని ప్రత్యక్ష సాక్షులు కొందరు చెప్పారు.
కుంభమేళాకు వెళ్లివస్తున్న ప్రయాణికులతో స్టేషన్ కిక్కిరిసిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
Next Story
-
Home
-
Menu