ట్రెండింగ్ లో SSMB29.. కారణమిదే?

సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా జంటగా.. మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ మరో కీ రోల్ లో కనిపించబోతున్న చిత్రం 'SSMB29'. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ ను ఒడిశా కొరాపుట్ ప్రాంతంలో పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్‌లో మహేష్, ప్రియాంక, పృథ్విరాజ్ లపై కీలక సన్నివేశాలను తెరకెక్కించాడు జక్కన్న.
షూటింగ్ పూర్తైన సందర్భంగా రాజమౌళి, ప్రియాంక లను కలిసేందుకు వందలాది మంది అభిమానులు తరలి వచ్చారు. వారితో రాజమౌళి, ప్రియాంక దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా కోరాపుట్ వాసుల ఆతిథ్యాన్ని ప్రశంసిస్తూ రాజమౌళి ఓ నోట్ రాశాడు. అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరీ ముఖ్యంగా ఈ సినిమాకి SSMB29 అనేది వర్కింగ్ టైటిల్ గా వినిపిస్తుంది. SSMB29 అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు 29 అని అర్థం. మిగతా హీరోల ఫ్యాన్స్ ఏమో ఈ మూవీకి SSMB29 వర్కింగ్ టైటిల్ కాదు.. SSRMB వర్కింగ్ టైటిల్ అంటూ మరికొన్ని టైటిల్స్ ప్రచారంలోకి తీసుకొచ్చారు. కానీ.. లేటెస్ట్ గా కోరాపుట్ ఫ్యాన్స్ కి రాసిన నోట్ లో రాజమౌళి ఈ సినిమాని SSMB29 గానే అభివర్ణించాడు. దీంతో.. మహేష్ ఫ్యాన్స్ SSMB29 హ్యాష్‌ట్యాగ్ ను ట్రెండింగ్ లో నిలబెట్టారు.
-
Home
-
Menu