కొత్త షెడ్యూల్ లో SSMB29

కొత్త షెడ్యూల్ లో SSMB29
X
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కలయికలో రూపొందుతున్న SSMB29 శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కలయికలో రూపొందుతున్న SSMB29 శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే హైదరాబాద్, ఒడిశాలలో రెండు కీలక షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ గ్లోబల్ మూవీ ప్రస్తుతం హైదరాబాద్ లో థర్డ్ షెడ్యూల్ జరుపుకుంటుంది. అందుకోసమే ప్రియాంక చోప్రా మళ్లీ హైదరాబాద్ వచ్చింది.

ఇటీవల న్యూయార్క్ లో ప్రియాంక భర్త నిక్ జోనాస్ మ్యూజికల్ 'ది లాస్ట్ ఫైవ్ ఇయర్స్'ను ప్రదర్శించారు. ఆ ఈవెంట్ కి మహేష్ బాబు ఫ్యామిలీ నమ్రత, గౌతమ్, సితార కూడా హాజరయ్యారు. ఇక లేటెస్ట్ షెడ్యూల్ లో మహేష్, ప్రియాంక మధ్య కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాడట జక్కన్న.

త్వరలో నాల్గవ షెడ్యూల్ కోసం టీమ్ ఇటలీ వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. అక్కడ వేలాది జూనియర్స్ మధ్య కీలక సన్నివేశాలను ప్లాన్ చేశాడట దర్శకధీరుడు. ఆద్యంతం అడవుల నేపథ్యంలో అడ్వంచరస్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో మహేష్ బాబు రగ్గడ్ గా బియర్డ్ లుక్ లో అదరగొట్టబోతున్నాడు. పాన్ వరల్డ్ రేంజులో SSMB29 రెడీ అవుతుంది.

Tags

Next Story