శ్రీరామ్ కు 14 రోజులు రిమాండ్

నటుడు శ్రీరామ్ అలియాస్ శ్రీకాంత్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. చెన్నై పోలీసులు ఆయనను ఎనిమిది గంటల పాటు విచారించి, అనంతరం కోర్టులో హాజరుపర్చగా జూలై 7 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు.
ఈ కేసు మైలాపూర్ ప్రాంతానికి చెందిన అన్నాడీఎంకే నేతలు ప్రసాద్, అజయ్ వాండైయార్‌ల అరెస్టుతో వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ సరఫరా వ్యవహారంలో ప్రసాద్ ద్వారా నటుడు శ్రీరామ్‌కు కొకైన్ చేరినట్లు దర్యాప్తులో బయటపడింది. ప్రదీప్‌కుమార్ అనే మరో నిందితుడి ద్వారా సరఫరా జరిగిందని పోలీసులు వెల్లడించారు. శ్రీరామ్ కొకైన్ కొనుగోలు చేసి ఆన్‌లైన్‌లో చెల్లించినట్లు ఆధారాలు లభించాయి.
చివరగా శ్రీరామ్ నుంచి రక్త నమూనాలు తీసి పరీక్షించగా, మత్తు పదార్థాలు వినియోగించినట్లు తేలడంతో పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు. వైద్య పరీక్షల్లో 42 సార్లు డ్రగ్స్ వాడినట్లు తేలిందని సమాచారం. ఆయనను ఎగ్మోర్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
ఈ కేసు రాజకీయ కోణాన్ని సైతం సంతరించుకుంది. AIADMK, బీజేపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సినీ పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ ప్రస్తుతం తెలుగులో ‘ఎర్ర చీర’ చిత్రంలో నటిస్తున్నారు. ఇటువంటి సమయంలో డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం కలకలం రేపుతోంది.
-
Home
-
Menu