ఉగాదికి ‘స్పిరిట్’ ప్రారంభం!

ఉగాదికి ‘స్పిరిట్’ ప్రారంభం!
X
రెబెల్ స్టార్ ప్రభాస్ కిట్టీలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో సందీప్ రెడ్డి వంగా చిత్రం ఒకటి. ఈ సినిమాకి ఇప్పటికే ‘స్పిరిట్‘ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

రెబెల్ స్టార్ ప్రభాస్ కిట్టీలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో సందీప్ రెడ్డి వంగా చిత్రం ఒకటి. ఈ సినిమాకి ఇప్పటికే ‘స్పిరిట్‘ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఈ మూవీకి సంబంధించి స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయట. ఈ చిత్రాన్ని ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

‘అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్’ వంటి వరుస బ్లాక్‌బస్టర్స్ తర్వాత సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ‘స్పిరిట్‘పై అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా.. ప్రభాస్ ఫస్ట్ టైమ్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్న సినిమా ఇది. ఈ మూవీ కోసం ప్రభాస్ మేకోవర్ కూడా ఎంతో సరికొత్తగా ఉంటుందట. అయితే.. ఉగాదికి ముహూర్తాన్ని జరుపుకోనున్న ‘స్పిరిట్‘ పట్టాలెక్కడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందట.

Tags

Next Story