సిద్ధు-శ్రీనిధి రొమాంటిక్ సాంగ్

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో రాబోతున్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ 'తెలుసు కదా'. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. వచ్చే నెలలో ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన 'మల్లిక గంధ' సాంగ్ చార్ట్ బస్టర్ అయ్యింది. లేటెస్ట్ గా నుంచి సెకండ్ సింగిల్ రిలీజయ్యింది.
ఈ పాటలో సిద్ధు-శ్రీనిధి మధ్య కెమిస్ట్రీ అదరగొట్టారు. ముఖ్యంగా సిద్దు స్టైలిష్ డ్యాన్స్ మూవ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తమన్ స్వరకల్పనలో కృష్ణకాంత్ రాసిన ఈ ట్రాక్ ను కార్తీక్, అద్వితీయ వొజ్జల ఆలపించారు. ఈ లిరికల్ వీడియోలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సింగర్ కార్తీక్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అక్టోబర్ 17న దీపావళి కానుకగా 'తెలుసు కదా' విడుదలకు ముస్తాబవుతుంది.
-
Home
-
Menu