జూన్ నుంచి షూటింగ్ షురూ!

జూన్ నుంచి షూటింగ్ షురూ!
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పాన్ ఇండియా డైరెక్టర్ అట్లీ కలయికలో రూపొందుతున్న భారీ సినిమా ఇప్పటికే అనౌన్స్ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్‌లో కొనసాగుతున్నాయి.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పాన్ ఇండియా డైరెక్టర్ అట్లీ కలయికలో రూపొందుతున్న భారీ సినిమా ఇప్పటికే అనౌన్స్ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్‌లో కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ విషయమై లేటెస్ట్ గా హైదరాబాద్ వచ్చాడట డైరెక్టర్ అట్లీ.

ఈ సినిమాలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికపైన చర్చలు జరపనున్నారట అల్లు అర్జున్, అట్లీ. ‘పుష్ప 2‘తో పాన్ ఇండియా లెవెల్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న బన్నీ, ‘జవాన్‘తో వెయ్యి కోట్లు క్లబ్ మూవీ అందించిన అట్లీ కలిసి పనిచేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రాజెక్ట్ A22 x A6 అనే వర్కింగ్ టైటిల్‌తో పిలవబడుతుంది.

ఆమధ్య బన్నీ బర్త్ డే స్పెషల్ గా లాస్ ఏంజెల్స్‌లో చిత్రీకరించిన ఒక ప్రత్యేక వీడియో ద్వారా ఈ సినిమా స్కేల్ ఏ రేంజులో ఉండబోతుందో ఇప్పటికే హింట్ ఇచ్చింది టీమ్. జూన్ నుంచి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సన్ పిక్చర్స్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Tags

Next Story