బుల్లితెరపై ‘పుష్ప 2’కి షాక్!

బుల్లితెరపై ‘పుష్ప 2’కి షాక్!
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప 2: ది రూల్' బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ సాధించి, భారత చలనచిత్ర చరిత్రలో అరుదైన రికార్డులు నమోదు చేసింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప 2: ది రూల్' బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ సాధించి, భారత చలనచిత్ర చరిత్రలో అరుదైన రికార్డులు నమోదు చేసింది. సుమారు రూ.1800 కోట్లు వసూలు చేసి ఇండియన్ సినిమా గౌరవాన్ని అంతర్జాతీయంగా పెంచింది. అయితే, అదే సినిమా ఇప్పుడు బుల్లితెరపై ప్రీమియర్ అయినప్పుడు మాత్రం ఆశించిన స్థాయిలో రిస్పాన్స్ రాలేదు.

స్టార్ మా చానెల్ గ్రాండ్ గా ప్రీమియర్ చేసినా, స్పెషల్ ఇంటర్వ్యూలు, ఎక్స్‌క్లూజివ్ ఫుటేజ్ వంటివి చూపించినా, ‘పుష్ప 2’కు కేవలం 12.6 టీఆర్పీ రేటింగ్ మాత్రమే లభించింది. ఇది బన్నీ కెరీర్‌లో 'నా పేరు సూర్య' వంటి ఫ్లాప్ సినిమాతో సమానంగా ఉండడం గమనార్హం. గతంలో అల వైకుంఠపురములో (29.4), పుష్ప 1 (22.5), డీజే (21.7) వంటి సినిమాలు టీవీలో భారీ రేటింగ్స్ సాధించాయి. వాటితో పోలిస్తే ‘పుష్ప 2’ రేటింగ్ నిరాశ కలిగించేలా ఉంది.

ఈ పరిణామానికి పలు కారణాలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఓటిటి ప్లాట్‌ఫామ్స్ వల్ల టీవీ ప్రీమియర్ల మీద ఆసక్తి తగ్గుతోంది. పైరసీ, థియేటర్లలో సినిమాలు ఆడే సమయంలోనే వాటి టెలికాస్ట్‌లు జరిగిపోవడం ఇవన్నీ టీవీ వ్యూయర్ అనుభూతిని దెబ్బతీశాయి. ప్రేక్షకులు ఇప్పుడు కంటెంట్‌ను తమకు అనుకూలంగా ఓటీటీలో చూసే అవకాశాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ ధోరణి కొనసాగితే శాటిలైట్ హక్కులకు ఉన్న డిమాండ్ తగ్గే ప్రమాదం ఉంది.

Tags

Next Story