సేతుపతి క్యారెక్టర్ లో షేడ్స్!

సేతుపతి క్యారెక్టర్ లో షేడ్స్!
X
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, కోలీవుడ్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కడానికి సిద్ధమవుతుంది.

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, కోలీవుడ్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కడానికి సిద్ధమవుతుంది. ‘లైగర్, డబుల్ ఇస్మార్ట్’ వంటి డిజాస్టర్ల తర్వాత పూరీ తన మార్క్ స్టోరీతో మళ్ళీ రీబిల్డ్ అయ్యే ప్రయత్నంలో ఉన్నాడు.

ఈ సినిమాలో విజయ్ సేతుపతి పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉండబోతున్నాయట. ఇందులో సేతుపతి పాత్ర మూడు డైమెన్షన్స్‌తో కనిపించనుందని సమాచారం. మొదట ఈ చిత్రానికి ‘బెగ్గర్’ అనే టైటిల్ వినిపించినప్పటికీ, విజయ్ సేతుపతి స్వయంగా ఆ పేరు ఫిక్స్ కాలేదని క్లారిటీ ఇచ్చాడు. లేటెస్ట్ గా ఈ మూవీకోసం ‘భవతీ భిక్షాందేహి’ అనే టైటిల్‌ ను పరిశీలిస్తున్నాడట డాషింగ్ డైరెక్టర్.

ఈ సినిమాలో సీనియర్ బ్యూటీ టబు, కన్నడ స్టార్ దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తుండగా, హీరోయిన్‌గా రాధికా ఆప్టే, నివేదా థామస్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. పూరి కనెక్ట్స్ పై రూపొందుతున్న ఈ సినిమాకి మహతి స్వర సాగర్ సంగీతాన్ని సమకూరుస్తాడనే ప్రచారం ఉంది.

Tags

Next Story