బాలీవుడ్ బాటలో 'సంక్రాంతికి వస్తున్నాం'

బాలీవుడ్ బాటలో సంక్రాంతికి వస్తున్నాం
X
2025లో తెలుగు సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ 'సంక్రాంతికి వస్తున్నాం'. విక్టరీ వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

2025లో తెలుగు సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ 'సంక్రాంతికి వస్తున్నాం'. విక్టరీ వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఫ్యామిలీ ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించిన ఈ ఎంటర్‌టైనర్ ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్ కానుందట.

లేటెస్ట్ ఇండస్ట్రీ బజ్ ప్రకారం, ఈ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు హిందీలో నిర్మించనున్నారట. హీరోగా అక్షయ్ కుమార్ నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ రీమేక్‌కి దర్శకత్వ బాధ్యతలు ‘భూల్ భూలయ్య 2, వెల్కమ్, రెడీ’ వంటి హిట్ చిత్రాల దర్శకుడు అనీస్ బాజ్మీ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

తెలుగులో రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా, నేటివిటీ-బేస్డ్ కామెడీతో మెప్పించింది. కానీ అదే ఫార్ములా హిందీలో వర్కౌట్ అవుతుందా అన్నది పెద్ద ప్రశ్నే. గత కొన్నేళ్లుగా అక్షయ్ కుమార్ కి రీమేక్ సినిమాలు అంతగా కలిసివచ్చినట్లే లేవు. అయినప్పటికీ, ఆయనకు ఉన్న టైమింగ్, కామెడీ సెన్స్ దృష్ట్యా ఈ కథను తన స్టైల్‌లో రీడిజైన్ చేస్తే మంచి ఫలితం సాధించే అవకాశం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి.

Tags

Next Story