సందీప్ రెడ్డి ప్రేమకథా చిత్రం

సందీప్ రెడ్డి ప్రేమకథా చిత్రం
X
‘అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్’ సినిమాలతో దేశవ్యాప్తంగా తనదైన ముద్ర వేసుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్‌తో ‘స్పిరిట్’ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు సందీప్.

‘అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్’ సినిమాలతో దేశవ్యాప్తంగా తనదైన ముద్ర వేసుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్‌తో ‘స్పిరిట్’ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు సందీప్. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

ఇదిలా ఉండగా, తన సొంత నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్ పై ఓ చిన్న సినిమాను కూడా నిర్మించబోతున్నాడట. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ చిత్రంతో రామ్‌గోపాల్ వర్మ శిష్యుడు వేణు దర్శకుడిగా పరిచయం కానున్నాడు. హీరోగా ‘మేం ఫేమస్’ ఫేమ్ సుమంత్ ప్రభాస్ ఎంపికయ్యాడు. తెలంగాణ నేపథ్యంలో సాగే ఓ ఫ్రెష్ లవ్ స్టోరీగా ఈ చిత్రం రూపొందుతున్నట్టు తెలుస్తోంది.

సందీప్ రెడ్డి వంగా పేరు వింటేనే సినిమా మీద ఒక ప్రత్యేక అంచనా ఏర్పడుతుంది. ఆయన దర్శకత్వం వహించినా, నిర్మాణం చేపట్టినా.. ఆయన మార్క్ తప్పకుండా కనిపిస్తుందని సినీ వర్గాల నమ్మకం. అందుకే ఈ చిన్న సినిమా కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం ఖాయమని అంటున్నారు.

Tags

Next Story