సాయిపల్లవికి కళైమామణి అవార్డు

సాయిపల్లవికి కళైమామణి అవార్డు
X
ప్రతిభకు గుర్తింపు లభిస్తే ఆ కళాకారుడి ఆనందం మరింత పెరుగుతుంది. ఇప్పుడు అటువంటి అరుదైన గౌరవాన్ని అందుకున్నది నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. తమిళనాడు ప్రభుత్వం ప్రకటించిన ‘కళైమామణి’ అవార్డుకు ఆమె ఎంపికయ్యింది.

సాహిత్యం, సంగీతం, నాటకం, సినిమా వంటి రంగాల్లో విశేష కృషి చేసిన వారిని గౌరవించేందుకు తమిళనాడు ప్రభుత్వం ప్రతి ఏడాది ఈ పురస్కారాన్ని అందిస్తుంది. 2021, 2022, 2023 సంవత్సరాలకు గాను కలిపి 90 మంది కళాకారులను తాజాగా ఈ గౌరవానికి ఎంపిక చేశారు. ఇందులో భాగంగా 2021 సంవత్సరానికి సాయి పల్లవి, అలాగే దర్శకుడు-నటుడు ఎస్‌.జె. సూర్య, దర్శకుడు లింగుసామి, నటులు విక్రమ్ ప్రభు, మణికందన్ లాంటి పలువురు ప్రముఖులు ఈ అవార్డులకు ఎంపికయ్యారు.

అదే విధంగా, 2023 సంవత్సరానికి సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ తో పాటు పలువురు కళాకారులు ఈ అవార్డును పొందబోతున్నారు. త్వరలో జరగబోయే కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ విజేతలందరికీ ఈ పురస్కారాలను అందజేయనున్నారు.

Tags

Next Story