విడుదలపై రూమర్లు.. మేకర్స్ క్లారిటీ!

విడుదలపై రూమర్లు.. మేకర్స్ క్లారిటీ!
X
పవన్ కళ్యాణ్‌ పాన్‌ ఇండియా మూవీ ‘హరిహర వీరమల్లు’ మరోసారి విడుదల వాయిదా పడింది. అసలు ఈ చిత్రం జూన్ 12న విడుదల కావాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ అయింది.

పవన్ కళ్యాణ్‌ పాన్‌ ఇండియా మూవీ ‘హరిహర వీరమల్లు’ మరోసారి విడుదల వాయిదా పడింది. అసలు ఈ చిత్రం జూన్ 12న విడుదల కావాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ అయింది. ఈ నేపథ్యంలో జూన్ 26 లేదా జూలై మొదటి వారంలో సినిమాను విడుదల చేయనున్నారన్న ప్రచారాలు సోషల్ మీడియాలో వేగంగా విస్తరించాయి. అయితే ఈ ఊహాగానాలపై నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్ స్పందించింది.

‘ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్న విడుదల తేదీలకు ఎలాంటి ఆధారాలు లేవు. మేమే అధికారికంగా ప్రకటించే వరకు ఎటువంటి సమాచారాన్ని నమ్మవద్దు’ అంటూ మేకర్స్ తమ ‘ఎక్స్’ అక్కౌంట్ ద్వారా ప్రకటన విడుదల చేశారు. త్వరలో విడుదలయ్యే ట్రైలర్ లో రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వనున్నారట.

ఇక ఓటీటీ భాగస్వామి అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా ఈ ఆలస్యంపై అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. గతంలో వాయిదాలపై మౌనంగా ఉన్నా, ఈసారి మాత్రం జూలై చివరినాటికి సినిమాను థియేటర్లలో విడుదల చేయాలన్న గడువు పెట్టినట్టు తెలుస్తోంది. అందువల్ల 'హరిహర వీరమల్లు' విడుదల ఈసారి వాయిదా పడే అవకాశం తక్కువగానే కనిపిస్తోంది.



Tags

Next Story